: ఆరోగ్యంగా ఉన్నా, మృత్యువుకు దగ్గర చేసే రెండు ప్రధాన కారణాలివే!
"అరె నిన్న కూడా మాట్లాడాను, రాత్రికి రాత్రే చనిపోయాడు".... "వారం క్రితమే కలిశాం. అంతలోనే ఏమైందో?"... ఇటువంటి మాటలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఆరోగ్యంగా కనిపిస్తూ, ఆకస్మాత్తుగా చనిపోవడం, మంచానపడి రోజుల వ్యవధిలో మత్యువుకు దగ్గర కావడం వెనుక కారణాలను వాషింగ్టన్ యూనివర్శిటీ, మెల్ బోర్న్ యూనివర్శిటీ రీసెర్చర్లు సంయుక్తంగా చేసిన అధ్యయనం వెల్లడించింది. ఎంత తింటున్నా తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం, రక్తపోటు అధికంగా ఉండటమే ఈ తరహా మరణాలకు కారణమని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ రెండూ శరీర ఆరోగ్యం, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం అపరిశుభ్రత, సురక్షిత నీరు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలు ప్రాణాలు తీసేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి వ్యక్తిగత అలవాట్లు ప్రాణాంతకం అవుతున్నాయని వారు తెలియజేశారు.