: జార్ఖండ్ సీఎం సహా 154 మందికి తప్పిన పెను ప్రమాదం
జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సహా 154 మందికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి రాంచీ బయలుదేరిన గో ఎయిర్ వేస్ విమానం రాంచీలో దిగుతున్న సమయంలో విమానం టైర్ పేలింది. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఈ ఘటన జరుగగా, సీఎం సహా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం టైర్ పేలిన తరువాత, విషయం తెలుసుకున్న పైలట్ చాకచక్యంగా వ్యవహరించి బ్రేకులు వేశారని, లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి వుండేదని తెలిపారు. ఈ ఘటన తరువాత రాంచీ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి.