: బీజేపీకి సరికొత్త అర్థం చెప్పిన రాజ్ ఠాక్రే!


బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. ముంబైలో మాంసం నిషేధంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీలో జనతా అంటే కేవలం జైనులే కాదని అన్నారు. బీజేపీ అంటే 'భారతీయ జంతుపక్ష' పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ముంబైలో ప్రజలు ఏం చేయాలన్న దానిని కేవలం జైనులే నిర్ణయించలేరు కదా? అని ఆయన ప్రశ్నించారు. రేపు ఇంకో వర్గానికి చెందిన ప్రజలు తమ పండగను పురస్కరించుకుని షాపులన్నీ మూసేయాలని కోరితే అలాగే చేస్తారా? అని ఆయన నిలదీశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని ఆయన బీజేపీకి సూచించారు. బీజేపీ చర్యల వల్ల జైనులకు హిందువులు వ్యతిరేకం అనే అర్థం వస్తోందని ఆయన మండిపడ్డారు. తక్షణం ప్రభుత్వ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News