: 'కేశవరెడ్డి విద్యాసంస్థల' డిపాజిట్ల సేకరణపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
'కేశవరెడ్డి విద్యాసంస్థల' డిపాజిట్ల సేకరణపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులు, కేశవరెడ్డి అరెస్టుపై కర్నూలు ఎస్పీ రవికృష్ణతో గంటా ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునే సమయంలో కేశవరెడ్డి విద్యాసంస్థ డిపాజిట్లు సేకరించి తిరిగి వెనక్కి ఇవ్వకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఆయన్ను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.