: రెండు సెకన్లలో బ్రిడ్జ్ ని కూల్చేశారు
నాలుగున్నర దశాబ్దాల నాటి బ్రిడ్జ్ ని రెండంటే రెండే సెకన్లలోనే కూల్చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. మధ్య చైనాలోని షాంగ్జియాజి నగరంలోని లిషుల్ బ్రిడ్జ్ స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, నెల రోజులపాటు ఆలోచించిన చైనా ప్రభుత్వం, టన్ను బరువున్న పేలుడు పదార్థాలతో పాత బ్రిడ్జ్ ని కూల్చేందుకు మూహూర్తం నిర్ణయించింది. 800 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జ్ ని 44 ఏళ్ల క్రితం పూర్తిగా రాళ్లతో నిర్మించారు. బ్రిడ్జ్ కు ఉన్న 15 భాగాలకు డిటోనేటర్లు, డైనమైట్ స్టిక్ లను అమర్చారు. బ్రిడ్జ్ కి ఇరువైపులా నివాస, వాణిజ్య భవనాలు ఉండడంతో ఎవరినీ బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టీవీలు లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా కేవలం రెండంటే రెండే సెకన్లలో బ్రిడ్జ్ ని కూల్చేశారు. కొత్త కట్టడం నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో చూడాలి!