: తన గురువును కలిసేందుకు రేపు రిషికేశ్ వెళుతున్న మోదీ


తన ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరిని కలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు రిషికేశ్ వెళుతున్నారు. అక్కడి ఆశ్రమంలో తన గురువుతో 40 నిమిషాల పాటు ఆయన గడుపుతారని తెలిసింది. అనంతరం గంగా నదీ తీరంలో మోదీ ధ్యానం చేయనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ తొలిసారి ఉత్తరాఖండ్ వెళుతున్నారు. ఇక స్వామి దయానంద గిరికి అనేకమంది శిష్యులుండగా వారిలో తెలుగువారైన స్వామి పరిపూర్ణానంద ముఖ్యులు.

  • Loading...

More Telugu News