: తోటపల్లికి నేనే శంకుస్థాపన చేశా... నేనే పూర్తి చేశా: చంద్రబాబు


2003లో తోటపల్లి ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని... ఇప్పుడు మళ్లీ తానే పూర్తి చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి 12 సంవత్సరాలు పట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూసిందని, కమిషన్లు తీసుకుని ఆ పార్టీ నేతలు బలిసిపోయారని విమర్శించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తాను ప్రాజెక్టు వద్దే పడుకుని, పూర్తి చేయించానని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు కుడి కాల్వకు నీటిని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News