: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిందే: మద్రాస్ హైకోర్ట్


హెల్మెట్ ధరించే విషయంలో మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. మహిళలు, పిల్లలు ఎవరికీ ఈ నిబంధన నుంచి మినహాయింపు లేదని పేర్కొంది. ఇది ప్రజా భద్రతకు సంబంధించిన విషయమని, అందరూ హెల్మెట్ ధరించక తప్పదని చెప్పింది. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. హెల్మెట్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడాన్ని 155 దేశాలు పాటిస్తున్నాయని జస్టిస్ ఎన్ కిరుబకరన్ తెలిపారు.

  • Loading...

More Telugu News