: భారత పర్యటనలో సౌతాఫ్రికా జట్టు కెప్టెన్లు ముగ్గురు


భారత పర్యటనకు సఫారీ జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. సిరీస్ లో టెస్టులు, వన్డేలు, టీట్వంటీలకు వేర్వేరుగా కెప్టెన్లను ఎంపిక చేసింది. 72 రోజులపాటు సాగనున్న భారత పర్యటనలో సఫారీ జట్టు 3 టీట్వంటీలు, నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది. టీట్వంటీ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డేలకు డివిలియర్స్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. టెస్టులకు హషీమ్ ఆమ్లాను కెప్టెన్ గా నియమించారు. విజయమే లక్ష్యంగా సౌతాఫ్రికా జట్టు భారత్ లో అడుగుపెడుతోంది.

  • Loading...

More Telugu News