: తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చాకలి ఐలమ్మ కథ!: హరీష్


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్టియాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ) విగ్రహాన్ని వరంగల్ జిల్లాలోని ఆమె స్వగ్రామం పాలకుర్తిలో మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెడతామని హామీ ఇచ్చారు. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఐలమ్మ పాఠ్యాంశాన్ని కూడా పెడతామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమెకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. త్వరలో హైదరాబాద్ లో ఐలమ్మ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News