: ఆ క్రెడిట్ సల్మాన్ దేనంటున్న ముద్దుగుమ్మ


బాలీవుడ్ లో తాను ఐదేళ్లు కొనసాగానంటే ఆ ఘనత సల్మాన్ ఖాన్ దేనని నటి సోనాక్షి సిన్హా చెప్పింది. దబాంగ్ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోనాక్షి ట్విట్టర్లో సినిమా యూనిట్ కు థ్యాంక్స్ చెప్పింది. హిట్ సినిమాతో బాలీవుడ్ లో భవిష్యత్ కు బంగారు బాట వేసిన సల్మాన్ కు ధన్యవాదాలు చెప్పింది. సల్మాన్ కారణంగానే బాలీవుడ్ లో నిలదొక్కుకున్నానని సోనాక్షి స్పష్టం చేసింది. దబాంగ్ ఆఫర్ ఇచ్చిన సల్మాన్ కు ధన్యవాదాలు చెప్పింది. కాగా, సోనాక్షి ఈ ఐదేళ్లలో 13 సినిమాలలో నటించింది. ప్రస్తుతం 'ఫోర్స్' సినిమాలో నటిస్తోంది. గతంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేసిన సోనాక్షి 'దబాంగ్'తో వెండితెర అరంగేట్రం చేసింది.

  • Loading...

More Telugu News