: ప్రపంచ వ్యాప్తంగా ఏడేళ్ల కనిష్ఠానికి ఆహార ఉత్పత్తుల ధరలు, ఇండియాలో మాత్రం...!
ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు ఏడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) గురువారం నాడు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితిలో అంతర్భాగంగా ఉన్న ఎఫ్ఏఓ వెల్లడించిన వివరాల ప్రకారం పాలు, కూరగాయలు, వంట నూనెలు, పంచదార, తృణ ధాన్యాల ధరలు గడచిన ఆగస్టులో గణనీయంగా తగ్గాయి. దిగుబడి పెరిగి మార్కెట్లలోకి ఆహార ఉత్పత్తులు ఎక్కువగా రావడం, ఇంధన ధరలు తగ్గడం, చైనాలో మాంద్యం తదితర కారణాలతో ధరలు తగ్గాయని వివరించింది. కాగా, ప్రపంచమంతటా ఫుడ్ ప్రొడక్టుల ధరలు ఒక రకంగా ఉంటే, ఇండియాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. పప్పు, చింతపండు దగ్గరి నుంచి ఉల్లిపాయల వరకూ అన్ని ఉత్పత్తుల ధరలూ రెండు నెలల క్రితంతో పోలిస్తే ధరలు పెరిగి ఉన్నాయన్న సంగతి తెలిసిందే