: కాలిఫోర్నియాలో కారుణ్య మరణానికి చట్టబద్ధత


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కారుణ్య మరణాల (యూతనేషియా)కు చట్టబద్ధత లభించింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కారుణ్య మరణంపై అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. దీంతో, కారుణ్య మరణానికి కాలిఫోర్నియా అనుమతించింది. ఆ రాష్ట్ర చట్టసభలో కారుణ్య మరణానికి 43 మంది మద్దతు పలకగా, 34 మంది వ్యతిరేకించారు. కారుణ్య మరణాలకు అనుమతించిన అమెరికా రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఆరవ రాష్ట్రంగా అవతరించింది. ఇప్పటికే వాషింగ్టన్, న్యూ మెక్సికో, మోంటానా, ఓరేగాన్, వెర్మొంట్ రాష్ట్రాల్లో కారుణ్య మరణాలకు అనుమతి ఉంది.

  • Loading...

More Telugu News