: కొన్న వస్తువులకు డబ్బులడిగినందుకు 'చావ'బాదారు!
గుజరాత్ లో నవతరం కుర్రాళ్లు హీరోయిజం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులు అరాచక ప్రవర్తనతో వార్తల్లోకెక్కుతున్నారు. అహ్మదాబాద్ లో ఓ పాన్ షాపు దగ్గరకు వెళ్లిన ఎనిమిది మంది యువకులు కొన్ని వస్తువులు తీసుకున్నారు. అనంతరం షాపు యజమాని వారిని డబ్బులు అడిగాడు. అంతే... ఆ యువకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'మమ్మల్నే డబ్బులు అడుగుతావా?' అంటూ అతనిని షాపు నుంచి బయటకు లాగి కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. వారి దెబ్బలు తాళలేక షాపు యజమాని మృతిచెందాడు. ఆ సమయంలో అక్కడ కొంత మంది ఉన్నా వారిని వారించకపోవడం విశేషం. ఈ వివరాలన్నీ దగ్గర్లోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.