: కూకట్ పల్లిలో నకిలీ పోలీసుల హల్ చల్


హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీసులకు నకిలీ పోలీసుల బెడద పట్టుకుంది. నలుగురు దొంగలు పోలీసుల పేరిట రంగంలోకి దిగి పలువురు వ్యక్తులను నిలువు దోపిడీ చేసినట్లు వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కూకట్ పల్లి పరిధిలోని పటేల్ కుంట పార్క్ సమీపంలో నలుగురు దొంగలు పోలీసులమని చెప్పి ఓ వ్యక్తిని నిలిపేశారు. పలు విషయాలపై ప్రశ్నలు సంధిస్తూ అతడి వద్ద ఉన్న రూ.4 వేల నగదు, ఖరీదైన సెల్ ఫోన్ ను అపహరించి ఉడాయించారు. అసలు విషయం తెలుసుకున్న బాధితుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదునందుకున్న పోలీసులు నకిలీ పోలీసుల కోసం వేట ప్రారంభించారు.

  • Loading...

More Telugu News