: బీజేపీ, కాంగ్రెస్ 'గాలి' యుద్ధం!


అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య 'గాలి' యుద్ధం జోరందుకుంది. మొన్నటికి మొన్న "బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీస్తోంది" అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించగా, ప్రధాని మోదీ దానికి కౌంటర్ వేశారు. "గాలి వీస్తోంది నిజమే. కాదీ అది హవాలా గాలి" అని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు సాగనున్న 10వ విశ్వహిందూ సమ్మేళన్ ను ఆయన ఈ ఉదయం భోపాల్ లో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, విదేశాంగ శాఖ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో మోదీ ప్రసంగిస్తూ, జీఎస్టీ అమలు వాయిదా పడుతూ వస్తుండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి గాలులు వీస్తున్నాయో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తమ ప్రభుత్వం కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాదని, చెప్పింది చేసి చూపిస్తామని అన్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో దళారీ వ్యవస్థను తొలగించడం ద్వారా సుమారు రూ. 19 వేల కోట్లను ఆదా చేశామని తెలిపారు. భారత వృద్ధి బాటకు ఎటువంటి ఆటంకాలూ లేవని, ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని వివరించారు.

  • Loading...

More Telugu News