: సిగ్గుపడాల్సిన రేవంత్, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు: బాల్క సుమన్


తాను సింహంలా సింగిల్ గా వచ్చా, తాను హైదరాబాద్ వస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పారిపోయారు... అంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన రేవంత్ రెడ్డి సిగ్గు పడాల్సింది పోయి... ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయాలో అర్థంకాక, ఏదో ఒకటి మాట్లాడాలనే యావతోనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News