: హైదరాబాదులో టీఆర్ఎస్ నేత అదృశ్యం...ఆచూకీ కోసం పోలీసుల లుకౌట్ నోటీసులు
హైదరాబాదులో మరో ప్రముఖ వ్యక్తి అదృశ్యమయ్యారు. గతంలో టీఆర్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జీగా వ్యవహరించిన ప్రముఖ వ్యాపారి ఆగిరి వెంకటేశ్ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇదివరలో వాసవి క్లబ్ అధ్యక్షుడిగానూ వ్యవహరించిన వెంకటేశ్ ఫైనాన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు ముషీరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు ఇంతవరకు ఏ ఒక్క చిన్న క్లూ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.