: వృద్ధులు నివసించడానికి అనువైన దేశాలేవో తెలుసా?
వృద్ధులు నివసించడానికి అనువైన దేశాలపై 'గ్లోబల్ ఏజ్ వాచ్' ఓ సర్వే నిర్వహించింది. 60 ఏళ్లుపైబడిన వారు ఆనందంగా నివసించడానికి స్విట్జర్లాండ్ అత్యుత్తమమైన దేశమని సర్వే వెల్లడించింది. 96 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా, అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానంలో నార్వే, స్వీడన్ దేశాలు నిలిచాయి. ఆయా దేశాల్లో వృద్ధులు సామాజికంగా, ఆర్థికంగా ఆనందంగా ఉన్నారని సర్వే తెలిపింది. జర్మనీ నాలుగో స్థానంలో నిలవగా, ఐదో స్థానంలో కెనడా, తరువాతి స్థానాల్లో నెదర్లాండ్స్, ఐస్ లాండ్, జపాన్, అమెరికా, యూకే, డెన్మార్క్ దేశాలు నిలిచాయని సర్వే వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 71వ స్థానంలో నిలిచిందని సర్వే పేర్కొంది.