: పిత్తాశయంలో 11,110 రాళ్లు...ఆపరేషన్ సక్సెస్


పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో గల ఎస్ఎస్ కేఎం ఆసుపత్రికి కోమల్ బజాజ్ (20) అనే యువకుడు కడుపునొప్పి అంటూ నెల క్రితం వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతని కడుపులోని పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతనికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. డాక్టర్ మఖన్ లాల్ సాహ్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కోమల్ కు నేడు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో అతని పిత్తాశయం నుంచి 11,110 రాళ్లు బయటపడడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ మధ్య కాలంలో పిత్తాశయంలో ఇంత పెద్ద ఎత్తున రాళ్లు కలిగిన వ్యక్తి కోమల్ బజాజ్ అని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News