: భారత్-ఏ వన్డే జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్...జట్టు వివరాలు
బంగ్లదేశ్-ఏ జట్టు పర్యటన త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో పాల్గొనేందుకు భారత వన్డే, టెస్టు జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. భారత-ఏ వన్డే జట్టుకు యువ ఆటగాడు ఉన్ముక్త్ చాంద్ నాయకత్వం వహించనున్నాడు. వన్డే జట్టులో సురేష్ రైనాకు అనుభవం ఉండగా, ఆల్ రౌండర్ కరణ్ నాయర్ టెస్టు జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్-ఏ జట్టుతో భారత-ఏ జట్టు 16, 18, 20వ తేదీలలో మూడు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టులో ఉన్ముక్త్ చాంద్ (కెప్టెన్), మయాంఖ్ అగర్వాల్, మనీష్ పాండే, సురేష్ రైనా, కేదార్ జాదవ్, సంజు శాంసన్, కరణ్ నాయర్, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్, రిషి ధావన్, శ్రీనాధ్ అరవింద్, ధవళ్ కులకర్ణి, కలారియా, గురుక్రీత్ సింగ్ చోటు సంపాదించుకున్నారు.