: ఆ చేపలు రానున్న ముప్పుకు సంకేతాలా?
భారత్, శ్రీలంక తీర ప్రాంతాల ఒడ్డుకు చేపలు భారీ సంఖ్యలో కొట్టుకువస్తున్నాయి. మత్స్య కారులు చేపలు పట్టుకునేందుకు సముద్రంలోకి వెళ్లే శ్రమ లేకుండానే ఒడ్డుకు చేరుకుంటున్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపలని పట్టుకునేందుకు అంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదానికి సంకేతమని చెబుతున్నారు. కొన్ని వారాల్లో సునామీ కానీ, తీర ప్రాంతాల్లో భారీ భూకంపం కానీ వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.