: ఢిల్లీలోని టాప్ లాయర్లు ఎవరెవరు ఎంతెంత వసూలు చేస్తున్నారో చూడండి...
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సీనియర్ అడ్వొకేట్లు వసూలు చేసే ఫీజు ఎంతో చూస్తే కళ్లు తిరుగుతాయి. ఎలైట్ క్లాస్ కు చెందిన వీరు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తారు. ఒక్కో హియరింగ్ కు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలు తీసుకోవడం వెరీ కామన్. న్యాయ వ్యవస్థలో అపర మేధావిగా పేరుగాంచిన రామ్ జెఠ్మలానీని లాయర్ గా పెట్టుకోవాలనే ఆలోచనను కూడా సామాన్యులు చేయలేరంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీలోనే కాదు, దేశంలో ఏ కోర్టులో వాదించాలన్నా రామ్ జెఠ్మలాని ఒక్కో హియరింగ్ కు మినిమం రూ. 25 లక్షలు తీసుకుంటారు. రాజకీయ నేతలైన లాయర్లు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న వారిలో అధిక సంఖ్యలో ఉండటం విశేషం. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఒక్కో హియరింగ్ కు రూ. 6 నుంచి 7 లక్షలు తీసుకుంటారు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఫాలీ నారీమన్ రూ. 11 నుంచి 15 లక్షలు తీసుకుంటారు. అలాగే మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా ఒక్కో హియరింగ్ కు రూ. 8 నుంచి 15 లక్షలు తీసుకుంటారు. ఒక్కో హియరింగ్ కు అత్యధిక ఫీజు వసూలు చేస్తున్న ఇతర లాయర్ల వివరాలు (లక్షల్లో)... కెకె వేణుగోపాల్... 5 - 7.5 హరీష్ సాల్వే... 6 - 15 ఏఎం సింఘ్వీ... 6 - 11 సీఏ సుందరం... 5.5 - 16.5 దుష్యంత్ దవే... 5.5 - 10 సల్మాన్ ఖుర్షీద్... 5 పరాగ్ త్రిపాఠి... 5 - 7 కెటిఎస్ తులసి ... 5 - 6 శాంతి భూషన్... 4.5 - 6 రంజిత్ కుమార్... 4 - 5 ఎల్.నాగేశ్వరరావు... 3 - 5