: నల్లధనం విషయంలో మరో సంస్థ పేరు బయటపెట్టిన స్విస్ ప్రభుత్వం
స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేస్తామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నెల రోజులు దానిపై విస్తృతమైన సమావేశాలు నిర్వహించిన ఎన్డీయే ప్రభుత్వం కమిటీ వేసి నల్లధనం వెనక్కి తీసుకువస్తామని పేర్కొంది. తాజాగా, స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకున్న అనుమానిత భారతీయ సంస్థ పేరును స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ పేరును అనుమానిత కంపెనీగా స్విస్ ప్రభుత్వం వెబ్ సైట్లో పెట్టింది. 1985లో చిన్న గోనె సంచుల తయారీ సంస్థగా నెలకొన్న నియో కార్పొరేషన్ ఇప్పుడు మల్టీ నేషనల్ టెక్స్ టైల్ కంపెనీగా అవతరించింది. దీనిపై అప్పీలు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నియో కార్పొరేషన్ కు నెల రోజుల గడువు ఇచ్చింది.