: మమ్మల్ని ఇష్టపడే వారే మాకు ఓటేస్తారు : బీహార్ సీఎం నితీష్


తమ సర్కార్ పనితీరు ఎవరికైతే నచ్చుతుందో వారే తమకు ఓటు వేస్తారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన సందర్భంగా జేడీ(యు) అధినేత మాట్లాడారు. వచ్చే నెలలో ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జనతాపరివార్ కూటమి నుంచి వైదొలగుతూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై నితీష్ ను విలేకరులు ప్రశ్నించారు. సొంతనిర్ణయం తీసుకునే హక్కు ఎస్పీ అధినేత ములాయంసింగ్ కు ఉందని నితీష్ అన్నారు.

  • Loading...

More Telugu News