: గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సీఈఓగా ప్రవాస భారతీయుడు
యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్ జీబీసీ) సీఈఓగా ప్రవాస భారతీయుడు మహేశ్ రామానుజం ఎంపికయ్యారు. చెన్నైకి చెందిన రామానుజం విశేష ప్రతిభ కలిగిన వ్యక్తి. నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ఉన్న రామానుజం తన ప్రతిభతో అగ్రస్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన యూఎస్ జీబీసీ బోర్డుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని చెప్పారు. యూఎస్ జీబీసీ అనేది ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సంస్థ. పర్యావరణ రహిత భవనాల డిజైనింగ్, నిర్మాణ, నిర్వహణకుగాను ఈ సంస్థ సలహాలు యిస్తుంది. కాగా, గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ గా ఇప్పటికే ఆయన అద్భుతమైన పనితీరు కనబరచారని యూఎస్ జీబీసీ బోర్డు అధిపతి మార్గె అండర్సన్ తెలిపారు.