: సోమేష్ కుమార్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పిటిషన్ పై క్యాట్ లో మరోసారి విచారణ వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ మధ్య అఖిల భారత ఉద్యోగుల విభజనలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. దాంతో తనను తెలంగాణలోనే కొనసాగించాలంటూ కమిషనర్ క్యాట్ ను ఆశ్రయించారు. ఈ రోజు వాదనలు జరగ్గా తదుపరి విచారణను క్యాట్ రేపటికి వాయిదా వేసింది.