: మహబూబ్ నగర్ జల్లాలో మహిళా రైతు ఆత్మహత్య
రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని, పలు కార్యక్రమాలను చేపట్టామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతుల ఆత్మహత్యలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోచోట రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జల్లా జమిష్టాపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. చెన్నమ్మ (35) అనే మహిళా రైతు తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కష్టాలు తీరుస్తుందనుకున్న పత్తి చేను ఎండిపోవడంతో, మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.