: ఆటో బయోగ్రాఫికల్ మెమరీతో రోబో పాఠాలు !
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి కొత్తగా వచ్చే శాస్త్రవేత్తలకు సమాచారం అందించే నిమిత్తం రోబోను సిద్ధం చేశారు. ఐఎస్ఎస్ లో శాస్త్రవేత్తలు ప్రతి ఆరునెలలకొకసారి మారిపోతుంటారు. భూమి నుండి కొత్త వారు అక్కడికి చేరుకోగానే..అక్కడున్న శాస్త్రవేత్తలు తిరిగి కిందకు వస్తుంటారు. కొత్తగా వచ్చిన వారికి సమాచారం ఎవరు అందిస్తారనేది ప్రశ్న. అందుకు సమాధానం ఒక రోబో చెబుతుంది. ఆటో బయో గ్రాఫికల్ మెమరీని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భౌతిక ప్రదర్శనలు, వాయిస్ కమాండ్ లతో చెప్పే వాటిని ఆటో బయోగ్రాఫికల్ మెమరీ సహాయంతో రోబో గుర్తుంచుకుంటుంది.