: ఈ నెల 26 నుంచి జగన్ నిరవధిక నిరాహార దీక్ష


వైకాపా అధినేత జగన్ ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్ష చేయనున్నారు. ఈ రోజు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిరాహార దీక్షపై లోతైన చర్చ జరిపి, తేదీని ఖరారు చేశారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ నుంచే జగన్ నిరాహార దీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే, 17వ తేదీన వినాయక చవితి పండుగ ఉండటంతో, దీక్షను వాయిదా వేయాలని వైకాపా నేతలు జగన్ కు సూచించారు. దీంతో, దీక్ష తేదీ 26కు మారింది.

  • Loading...

More Telugu News