: 54 ఏళ్ల వయసులో 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లాడనున్న మారడోనా


ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్, అర్జెంటీనా మాజీ కెప్టెన్ డీగో మారడోనా మరోసారి ఇంటివాడు కానున్నాడు. తన మాజీ ప్రియురాలు ఒలివాను మారడోనా పెళ్లాడనున్నాడు. తమ పెళ్లి విషయాన్ని ఒలివానే స్వయంగా వెల్లడించింది. వాటికన్ సిటీలో పోప్ సమక్షంలో వీరు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి. డిసెంబర్ 31న వీరు పెళ్లి చేసుకుంటారనే వాదన కూడా ఉంది. అయితే, ఒలీవా మాట్లాడుతూ, ఈ ఏడాదే తమ పెళ్లి ఉంటుందని, డేట్స్ ఇంకా ఫిక్స్ చేయలేదని చెప్పింది. 2003లో తన భార్య క్లౌడియాకు మారడోనా విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జాయింట్ అకౌంట్ కు సంబంధించి పేచీలు రావడంతో, క్లౌడియా కోర్టుకెక్కింది. మారడోనా ప్రస్తుతం ఈ కేసు విషయమై చికాకుల్లో ఉన్నాడు.

  • Loading...

More Telugu News