: బీహార్ లో ఆధిపత్యశక్తిగా బీజేపీ ఆవిర్భవిస్తుంది: ఆప్ మాజీ సభ్యుడు యోగేంద్ర


బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ఆధిపత్య శక్తిగా ఆవిర్భ వించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ జోస్యం చెప్పారు. ఒక ఆంగ్ల దినపత్రిక ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది కాదు, రాజకీయంగా ప్రబలమైన శక్తిగా బీజేపీ ఉంటుందని అన్నారు. మిగతా పార్టీల తీరును పరిశీలిస్తే, బీహార్ లో బీజేపీ నంబర్ వన్ రాజకీయ శక్తిగా ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఉన్న సామాజిక న్యాయ రాజకీయ ప్రయోజనాలను తలకిందులు చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితికి కారణం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లేనని యోగేంద్ర ఆరోపించారు.

  • Loading...

More Telugu News