: షీనా బోరా హత్య కేసు ఆధారంగా సినిమా


షీనా బోరా సంచలనాత్మక హత్య కేసు ఆధారంగా హిందీలో సినిమా తెరకెక్కుతోంది. 'ఏక్ కహానీ జూలీ కీ' పేరుతో ఆ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రధానపాత్రలో బాలీవుడ్ నటి, ఐటెం డ్యాన్సర్ రాఖీ సావంత్ నటిస్తోంది. దానిపై ఆమె మాట్లాడుతూ, తనకు షీనా, ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలు బాగా తెలుసునని తెలిపింది. గతంలో పీటర్ నిర్మాణంలో వచ్చిన రియాల్టీ షోలు జరుగుతున్న సమయంలో సెట్ లో వారిని కలసినట్టు చెప్పింది. అంతేకాదు, బోరా కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి గురించి ప్రతి విషయం తెలుసునంటోంది రాఖీ. అందుకే ఈ సినిమాలో తనకంటే బాగా ఎవరూ నటించలేరని, ఇంద్రాణి ఒకప్పుడు తనకి అభిమాని అని చెబుతోంది.

  • Loading...

More Telugu News