: పాక్ మరో దుర్మార్గం... నీటిలో విషం కలిపే ఆలోచన: హెచ్చరించిన నిఘావర్గాలు


రాజస్థాన్ సమీపంలోని గ్రామాలకు నీరందించే వనరుల్లో పాకిస్థాన్ విషం కలిపే అవకాశాలు ఉన్నట్టు మిలటరీ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జైసల్మేర్, బాద్మర్ జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రెండు జిల్లాల్లోని నీటి సంఘాలు సైన్యంతో పాటు స్థానికంగా ఉన్న గ్రామాలకూ నీటిని సరఫరా చేస్తుంటాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమయ్యాయని, సెక్యూరిటీ అధికారులు ఈ తరహా చర్యలను అడ్డుకునేందుకు పహారా కాస్తున్నారని రాజస్థాన్ నీటి సరఫరా విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రజలను సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు తెలిపారు. మరో 24 గంటల్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రేంజర్ల సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ వార్తలు వెలువడటం గమనార్హం.

  • Loading...

More Telugu News