: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు 6 శాతం డీఏ (కరవు భత్యం) పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దాంతో కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ క్రమంలో మూలవేతనంపై 119 శాతానికి డీఏ పెరిగినట్టైంది. జులై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపుకు ఆమోదం లభించింది. గతంలో 113 శాతంగా ఉన్న డిఏ ప్రస్తుతం 119కి పెరిగింది. స్పెక్ట్రమ్ వేలంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారు.