: వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఛైర్మన్ తో అభిప్రాయాలను పంచుకున్న కేసీఆర్
చైనాలోని డలియన్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోరం ఛైర్మన్ క్లౌస్ స్కాబ్ ను ఆయన కలిశారు. ఆర్థిక వృద్ధిపై ఇరువురూ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధిని, ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని క్లౌస్ స్కాబ్ కు ఆయన వివరించారు. కేవలం మూడు నెలల కాలంలో 56 సంస్థల నుంచి రూ. 12 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించామని చెప్పారు. అనంతరం స్కాబ్ మాట్లాడుతూ, కేసీఆర్ తో భేటీ కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.