: పోలీసులకు చిక్కిన 20 మంది చోర నారీలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోని పెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక్కడ నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంటుంది. ఇదే అదనుగా ఇక్కడ చోరీలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈ రోజు 20 మంది మహిళా దొంగలు పట్టుబడ్డారు. వీరు మార్కెట్లో వీలు చిక్కినప్పుడల్లా చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.