: వెంకన్న నీడకు ఒంటిమిట్ట కోదండ రాముడు!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా జరిపించిన ఒంటిమిట్ట కోందండ రామాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి వెళ్లిపోయింది. ఒంటిమిట్ట ఆలయాన్ని విలీనం చేసుకున్నట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ ఉదయం వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సమీప భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తామని వివరించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం విలీన కార్యక్రమం నిర్వహించామని చదలవాడ పేర్కొన్నారు. ఒంటిమిట్ట అభివృద్ధికి పుష్కలంగా నిధులందిస్తామని, అక్కడి కోదండ రామాలయంలో యాత్రికులకు అన్ని వసతులు కల్పిస్తామని ఆయన తెలియజేశారు.

  • Loading...

More Telugu News