: ధోనీ... కమెడియన్ ఆఫ్ టీమిండియా: సురేశ్ రైనా సరికొత్త కామెంట్!


మైదానంలో కూల్ గా కనిపించే టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలో పెద్ద జోకరే దాగున్నాడంటున్నాడు జట్టు సభ్యుడు సురేశ్ రైనా. ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా రైనా, మిస్టర్ కూల్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. కమెడియన్ ఆఫ్ టీమిండియాగా ధోనీని అభివర్ణించిన రైనా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘‘మైదానంలో ధోనీ చాలా సీరియస్ గా ఉంటాడు. కానీ, డ్రెస్సింగ్ రూమ్ లో అడుగుపెట్టాడంటే చాలు వాతావరణం సరదాగా మారిపోతుంది. అతడు వేసే జోకులకు అందరూ పగలబడి నవ్వుతారు. ఇతరుల సంగతేమో నాకు తెలియదు కాని, నా మటుకైతే టీమిండియాలో కమెడియన్ ఎవరంటే ధోనీనేనని చెబుతా’’ అని రైనా చెప్పాడు. దేశం పట్ల ధోనీకి అంకితభావం మెండుగా ఉందని కూడా రైనా చెప్పాడు. ‘‘ధోనీకి కూతురు పుట్టిన సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాం. ధోనీ తలచుకుంటే భారత్ వెళ్లి రావచ్చు. కాని ధోనీ వెళ్లలేదు. ఎందుకని ప్రశ్నిస్తే... తనకు ముందు దేశం, ఆ తర్వాతే కుటుంబమని ధోనీ చెప్పాడు’’ అని కూడా రైనా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News