: బ్రిటన్ విమానంలో మంటలు... సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
అమెరికాలోని లాస్ వెగాస్ విమానాశ్రయంలో నేటి ఉదయం పెను ప్రమాదమే తప్పింది. 172 మంది ప్రయాణికులతో ఆ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుంటున్న బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీనిని పసిగట్టిన ఎయిర్ పోర్టు సిబ్బంది క్షణాల్లో స్పందించారు. విమానాన్ని నిలిపేసి పరుగు పరుగున విమానం వద్దకెళ్లి అందులోని ప్రయాణికులందరినీ క్షణాల్లో కిందకు దించేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి కూడా గాయాలు కాకుండా ఎయిర్ పోర్టు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.