: విమానం కూలితే సహాయక చర్యలు చేబట్టకుండా, సెల్ఫీలు తీసుకున్న పోలీసులు!
సెల్ఫీల మోజులో పడి మానవత్వాన్ని మరచిపోతున్నారనడానికి తాజా ఉదాహరణ ఇది. బ్రిటీష్ పోలీసు విభాగంలో కొత్తగా చేరిన ఇద్దరు పోలీసు అధికారులు లండన్ లోని ఓ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాల్సి ఉంది. అక్కడికి కొద్ది దూరంలో ఓ విమానం కుప్పకూలింది. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాల్సిన సదరు యువ పోలీసు అధికారులు, తమ బాధ్యతను మరచి, ఆ ప్రమాద సంఘటన బ్యాక్ గ్రౌండులో నిలబడి సెల్పీలు దిగారు. అనంతరం ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా సహోద్యోగులకు ఫార్వర్డ్ చేయడంతో ఘటన బయటపడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడగా, 16 మంది గాయాలతో బయటపడ్డారు. దీంతో బాధితుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన పోలీసు శాఖ, దీనిపై దర్యాప్తు చేపట్టింది.