: ఇస్రో కీర్తి కిరీటంలో చేరనున్న పురస్కారం


అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత దేశం కీర్తిపతాకాన్ని ఎగురవేసిన సంస్థ ఇస్రో. సినిమా నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో అంతరిక్ష యాత్రను చేపట్టి విజయవంతం చేసిన ఇస్రో ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఇస్రో కీర్తి కిరీటంలో ఓ కొత్త పురస్కారం వచ్చి చేరనుంది. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన గాంధీ శాంతి బహుమతి ఇస్రోను వరించింది. 1995 గాంధీజీ 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరివర్తన రంగాల్లో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందజేయనుంది. 2014వ సంవత్సరానికి గాను ఇస్రోకు ఈ అవార్డు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News