: దలైలామాను తిట్టిపోసిన చైనా పత్రిక
'ప్రవాసంలో ఉన్న క్రూర పరిపాలకుడు టిబెట్ మత గురువు దలైలామా' అంటూ చైనా ప్రభుత్వ పత్రిక ఓ ఎడిటోరియల్ రాసింది. ఇందులో ఆయన్ని తూర్పార బట్టింది. టిబెట్ అటానమస్ రీజియన్ ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గ్లోబల్ టైమ్స్ రాసిన ఎడిటోరియల్ సాగిన తీరు..నిజమైన టిబెట్ దలైలామా రహస్యాలను దాచి ఉంచదన్నారు. ప్రజల దృష్టిలో రెండు టిబెట్లు ఉన్నాయి. ఒకటి నిజమైన టిబెట్. దలైలామా ఊహాజనిత, విదేశాల అండతో ఎదగాలనుకున్న టిబెట్ రెండోది. రెండో టిబెట్ ఎప్పటికీ రాదని ఆ ఎడిటోరియల్ లో పేర్కొంది.