: సోనియా గాంధీపై ధ్వజమెత్తిన స్మృతీ ఇరానీ


ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆమె ఆరోపించారు. నాశనం చేయడమే కాకుండా సరిచేయాలని చూస్తున్న ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మోదీకి పట్టం కట్టారన్న విషయం కాంగ్రెస్ నేతలు గుర్తించాలని ఆమె సూచించారు. ఇన్నాళ్లూ దేశ పరిస్థితి దిగజార్చి ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. కాగా, ఏఐసీసీ సమావేశం సందర్భంగా మోదీ పాలనపై సోనియా గాంధీ పెదవి విరిచిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News