: లెబనాన్, సిరియాలను ముంచెత్తిన ఇసుక తుపాను
లెబనాన్, సిరియా దేశాలను ఇసుక తుపాను ముంచెత్తింది. దీంతో లెబనాన్ రాజధాని బీరూట్ మొత్తం దుమ్ము, ధూళి కమ్మేసింది. అకస్మాత్తుగా ముంచెత్తిన ఇసుక తుపానుతో స్ధానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. బయట ఉన్నవారు ఊపిరి పీల్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రజలెవరూ బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని సిరియా, లెబనాన్ దేశాలు ప్రజలకు సూచన చేశాయి.