: ఐపీఎల్ కు పోటీగా వస్తున్న 'పీఎస్ఎల్'కి బ్రాండ్ అంబాసిడర్లుగా రమీజ్ రాజా, వసీం అక్రమ్
బీసీసీఐ ప్రవేశపెట్టిన ఐపీఎల్ కు పోటీగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రంగంలోకి దించుతున్న పాకిస్థాన్ టీట్వంటీ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కు బ్రాండ్ అంబాసిడర్లుగా పాక్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, వసీం అక్రమ్ ను నియమించింది. ఈ మేరకు వసీం అక్రమ్, రమీజ్ రాజాలతో మూడేళ్ల ఒప్పందాన్ని పీఎస్ఎల్ ఖరారు చేసింది. లాహార్ లో పీసీబీ ఏర్పాటు చేసిన సమావేశంలో వీరిద్దరూ ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపినట్టు పీఎస్ఎల్ అధికార ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 24 మధ్య ఖతార్ లోని దోహా వేదికగా పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. పీఎస్ఎల్ ద్వారా పీసీబీ బలోపేతమవుతుందని అంచనా వేస్తోంది.