: భార్య ముక్కు కొరికి తినేశాడు!
తాను ఫోన్ చేస్తే మాట్లాడటం లేదన్న కోపంతో తన భార్య ముక్కును కొరికేసిన సంఘటన చైనాలో జరగింది. షాండాంగ్ రాష్ట్రం డిజోవూ పట్టణంలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త చేసిన ఫోన్ కాల్స్ కు భార్య జినాన్ స్పందించలేదు. దీంతో ఆమె ముక్కును కొరికి, విడిపడ్డ భాగాలను తినేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విడిపడ్డ ముక్కు భాగాలను ఆమె భర్త తినేశాడని తెలియడంతో, ప్లాస్టిక్ సర్జరీ చేద్దామనుకున్న వైద్యులు పాపం... ఏమీ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.