: వర్షాలు కురవడం లేదని కూడా కేసులు పెడతారేమో!: వెంకయ్యనాయుడు


వర్షాలు కురవడం లేదని.. అందుకు సూర్య భగవానుడే కారణమంటూ ఆయనపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు పెట్టినా పెట్టొచ్చంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం నాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు పలు హామీలు ఇచ్చింది. ఈ హామీలన్నింటిని బీజేపీ సర్కార్ నెరవేర్చ లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది. ఈ సంఘటనలపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. రాజకీయ ఉన్మాదంలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే ఇటు వంటి పనులకు పాల్పడుతోందని వెంకయ్యనాయుడు విమర్శించారు.

  • Loading...

More Telugu News