: బస్సుల నుంచి అంత శబ్దం ఎందుకు వస్తోంది?: నివేదిక కోరిన గ్రీన్ ట్రైబ్యునల్
బస్సుల నుంచి అంత శబ్దం ఎందుకు వస్తోందో నివేదిక ఇవ్వాలని బస్సుల తయారీ సంస్థలు టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ సంస్థలను గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇతర వాహనాల కంటే బస్సులే రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని గ్రీన్ ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. బస్సుల డిజైన్, తయారీకి సంబంధించిన వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆ సంస్థలకు సూచించింది. అలాగే బస్సుల్లో డ్రైవర్ సీటు ఇంకొంచెం కిందికి ఉంటే రోడ్డు స్పష్టంగా కనిపించి ప్రమాదాలు నివారించవచ్చని, బస్సు తయారీ సంస్థలు దానిపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని ట్రైబ్యునల్ ప్రశ్నించింది. ట్రాఫిక్ లో బస్సులు నడిపేందుకు వీలుగా, తక్కువ శబ్దంతో పరిమాణం తగ్గించి తయారు చేయాలని సూచించింది. కాగా, ఢిల్లీ రోడ్డు రవాణా సంస్థ పది వేల బస్సులు ఆర్డరివ్వనుంది. ఈ నేపథ్యంలోనే గ్రీన్ ట్రైబ్యునల్ పలు సూచనలు చేసింది.