: షర్మిల ఓదార్పు యాత్ర అర్థాన్నే మార్చేశారు: వీహెచ్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న ఓదార్పు యాత్రలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శలు చేశారు. సంవత్సరాల తరబడి పరామర్శల యాత్ర చేస్తూ అసలు ఓదార్పు యాత్ర అర్థాన్నే మార్చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ పైవిధంగా ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్ష పదవీకాలం పొడిగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు విదేశీ పర్యటనల్లో పోటీ పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో గ్రామాలు దత్తత తీసుకున్న సినీ నటులు మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ లకు వీహెచ్ అభినందనలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News